AP Cabinet: అర‌కు ఎంపీ కారును వెన‌క నుంచి ఢీకొట్టిన వైసీపీ నేత కారు... త‌ప్పిన ప్ర‌మాదం

accidnt in ysrcp samajika nyaya bheri bus yatra no one injured
  • నంద్యాల జిల్లా ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • వెల్దుర్తి మండ‌లం అల్లుగుండు వద్ద స‌డెన్‌గా ఆగిన ఎంపీ మాధ‌వి కారు
  • స‌కాలంలో గుర్తించ‌క ఆమె కారును ఢీకొట్టిన వెనుక ఉన్న కారు
  • ఏ ఒక్క‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్న మంత్రులు
ఏపీ కేబినెట్‌లోని బ‌డుగులు, బ‌ల‌హీన వర్గాల‌కు చెందిన మంత్రులు చేప‌ట్టిన సామాజిక న్యాయ భేరి బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఆదివారం ఓ పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. యాత్ర‌కు హాజ‌రైన అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి కారును వైసీపీకి చెందిన ఓ ప్ర‌జా ప్ర‌తినిధి కారు వెన‌క నుంచి బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టుకున్న రెండు కార్లు స్వ‌ల్పంగా దెబ్బ తిన‌గా...ఎంపీకి గానీ, ఆమె కారును ఢీకొట్టిన కారులోని వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీకాకుళం నుంచి మొద‌లైన ఈ యాత్ర ఆదివారం నంద్యాల, క‌ర్నూలు జిల్లాలను దాటుకుని అనంత‌పురం జిల్లాలోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. డోన్ నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని వెల్దుర్తి మండ‌లం అల్లుగుండు వ‌ద్ద యాత్ర‌లోని వాహ‌నాలు జాతీయ ర‌హ‌దారిపై వేగంగా సాగిపోతున్న వేళ‌... ఉన్న‌ప‌ళంగా ఎంపీ మాధ‌వి కారు ఆగింది. అయితే ఆమె వెనుకాలే వ‌స్తున్న కారు డ్రైవ‌ర్ ఈ విష‌యాన్ని గుర్తించేలోగానే ఆ కారు మాధ‌వి కారును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఏ ఒక్క‌రికి కూడా చిన్న గాయం కూడా కాక‌పోవ‌డంతో యాత్ర‌లో కీల‌క భూమిక పోషిస్తున్న మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు.
AP Cabinet
AP MInisters
Samajika Nyaya Bhefi
Nandyal Disrtrict
YSRCP
MP Goddeti Madhavi
Araku Mp

More Telugu News