Kalyanram: ఆసక్తిని రేకెత్తిస్తున్న 'బింబిసార' స్పెషల్ పోస్టర్!

Bimbisara movie update
  • 'బింబిసార'గా కనిపించనున్న కల్యాణ్ రామ్
  • రెండు కాలాల్లో ఆసక్తికరంగా నడిచే కథ
  • రెండు విభిన్న పాత్రలను పోషించిన కల్యాణ్ రామ్ 
  • కథానాయికలుగా ముగ్గురు భామలు 
  • ఆగస్టు 5వ తేదీన విడుదలవుతున్న సినిమా
కల్యాణ్ రామ్ కొంత కాలం క్రితం ఎలాంటి హడావిడి లేకుండా 'బింబిసార' పోస్టర్ ను వదిలాడు. 'బింబిసార'గా ఆయన లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. యుద్ధం నేపథ్యంలోని పోస్టర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.   

రెండు కాలాల్లో నడిచే ఈ కథలో కల్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన పోస్టర్ ను .. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం సందర్భంగా కొంతసేపటి క్రితం విడుదల చేశారు. వైవిధ్యభరితమైన రెండు పాత్రల్లో కల్యాణ్ రామ్ కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని  పెంచుతున్నాడు. 

చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ .. వార్నియా హుస్సేన్ అలరించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. బ్రహ్మాజీ కనిపించనున్నారు.
Kalyanram
Catherine
Bimbisara Movie

More Telugu News