Somireddy Chandra Mohan Reddy: కేసీఆర్ కు ఇన్నాళ్లకు ఎన్టీఆర్ గుర్తుకురావడం సంతోషం: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Very happy for KCR to remember NTR after a long time says Somireddy
  • వైసీపీ నేతల బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందన్న సోమిరెడ్డి 
  • వారి బస్సు యాత్ర కూడా కూడా రివర్స్ లోనే ఉందని కామెంట్ 
  • టీఆర్ఎస్ ప్రధాన నేతలంతా టీడీపీవాళ్లేనని వ్యాఖ్య 
సామాజిక న్యాయభేరి పేరుతో వైసీపీ నేతలు బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు చేపట్టిన యాత్రకు ప్రజా స్పందన లేదని, వారు నిర్వహిస్తున్న సభలకు జనాలు రావడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ది రివర్స్ పాలన అని... ఇప్పుడు వారి పార్టీ బస్సు యాత్ర కూడా రివర్స్ లోనే ఉందని చెప్పారు.  

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇన్నాళ్లకైనా ఎన్టీఆర్ గుర్తుకొచ్చినందుకు సంతోషమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధాన నేతలందరూ టీడీపీవాళ్లేనని చెప్పారు. అందరూ ఎన్టీఆర్ శిష్యులేనని అన్నారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
YSRCP
Bus Yatra
KCR
TRS

More Telugu News