Imran Khan: పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ 6 రోజుల డెడ్ లైన్

Imran Khan gives 6 days to Pakistan govt for announcing polls says Will return to Islamabad

  • ఎన్నికల తేదీలు ప్రకటించాలని ఇమ్రాన్ డిమాండ్
  • లేదంటే మరోసారి ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ చేస్తామని హెచ్చరిక
  • అజాదీ మార్చ్ ర్యాలీలో ప్రకటించిన ఇమ్రాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తలపెట్టిన ‘అజాది మార్చ్’ రాజధాని ఇస్లామాబాద్ కు గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్వరంతో మాట్లాడారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆరు రోజుల గడువు విధించారు. ఆరు రోజుల్లోపు ఎన్నికల తేదీలను ప్రకటించకపోతే మరోసారి ఇస్లామాబాద్ కు యావత్ దేశాన్ని వెంట పెట్టుకుని వస్తానని హెచ్చరించారు. 

రాజధాని ఇస్లామాబాద్ వరకు అజాది మార్చ్ ను బుధవారం ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో పంజాబ్, కరాచి, లాహోర్ లో పోలీసులు, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. లాహోర్ లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం, ఏటీఎంల్లో డబ్బులు ఖాళీ అయిపోయినట్టు మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ట్విట్టర్లో ప్రకటించారు.

ఇస్లామాబాద్ లోకి ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ ప్రవేశించడానికి ముందు.. పట్టణంలో సుప్రీంకోర్టు, మంత్రుల నివాసాలు ఉండే కీలక ప్రాంతాల భద్రతకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన తెలపాలని ఇమ్రాన్ ఖాన్ భావించగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Imran Khan
Islamabad
polls
deadline
azadi march
  • Loading...

More Telugu News