EC: జనసేన, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి పార్టీలపై చర్యలకు సిద్ధమైన ఈసీ

EC Warns Unrecognized parties to take action
  • దేశంలో 2,100కి పైగా ఈసీ గుర్తింపు లేని పార్టీలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించిన ఈసీ
  • చర్యలు తప్పవని హెచ్చరిక
ఎన్నికల సంఘం గుర్తింపు పొందని రాజకీయ పార్టీలపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమైంది. ఈ పార్టీలన్నీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించిన ఈసీ చర్యలు తప్పవని హెచ్చరించింది. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ అవి సేకరించిన విరాళాల నివేదికను ఈసీకి అందించాల్సి ఉంటుంది. అలాగే పేర్ల మార్పిడి, ప్రధాన కార్యాలయం, ఆఫీస్ బేరర్లు, చిరునామాల వివరాలను ఈసీకి అందించాలి. 

అయితే, గుర్తింపు పొందని పార్టీలన్నీ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. దేశంలో ఇలాంటి పార్టీలు 2,100కు పైగా ఉన్నట్టు తెలిపింది. వీటన్నింటిపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్న ఈసీ.. ఎలాంటి చర్యలు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈసీ పేర్కొన్న పార్టీలో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన, ప్రొఫెసర్ కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలు కూడా ఉన్నాయి.
EC
Janasena
TJS
Praja Shanti Party

More Telugu News