Ayyanna Patrudu: జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడు: అయ్య‌న్న పాత్రుడు

ayyanna slams jagan

  • జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్లాడు అనేది పచ్చి అబద్ధమ‌న్న అయ్య‌న్న‌
  • జ్యూరిక్‌ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం ప‌లు వివ‌రాలు పోస్ట్
  • ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉందని ట్వీట్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పిన ఏపీ సీఎం జగన్ లండ‌న్‌కు వెళ్లార‌ని, అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న‌ విమానంలో ఆయ‌న ప్ర‌యాణం కొన‌సాగింద‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ఏపీ మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే, ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు చెప్పారు. 

''జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడు. జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్లాడు అనేది పచ్చి అబద్ధం. జ్యూరిక్‌ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, జ్యూరిక్‌ దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఈ 190 ఫ్లైట్ వస్తుందని సమాచారం ఇచ్చారు. ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉంది. ఇప్పుడు ఏమి చెబుతావ్ బుగ్గన? చెప్పు ఏ బుర్ర కథ చెబుతావో'' అని అయ్య‌న్న పాత్రుడు నిల‌దీశారు.

Ayyanna Patrudu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News