F3: జోరుగా హుషారుగా 'ఎఫ్3' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

F3 Pre Release event held at Hyderabad Shilpa Kala Vediika

  • వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3
  • ఈ నెల 27న రిలీజ్
  • హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • శిల్పకళావేదికలో వేడుక

విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన ఎఫ్3 చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాదు శిల్పకళావేదిక వేదికగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్, హీరోయిన్ మెహ్రీన్, సోనాల్ చౌహాన్, ప్రగతి, వై.విజయ, అలీ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు సందడి చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో వీడియో వస్తుండగా, ఆయన అభినయం చేసి చూపించారు. ఆద్యంతం ఎంతో హుషారుగా కనిపించారు. 

గతంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2 చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన ఎఫ్3 చిత్రం అంతకుమించి నవ్వులు పండిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

F3
Pre Release Event
Shilpa Kala Vedika
Hyderabad
Venkatesh
Varun Tej
Anil Ravipudi
Tollywood
  • Loading...

More Telugu News