Mahesh Babu: బాక్సర్ నిఖత్ జరీన్ అద్భుత విజయం పట్ల మహేశ్ బాబు స్పందన

Mahesh Babu appreciates boxer Nikhat Zareen on her golden punch at world boxing championship

  • వరల్డ్ చాంపియన్ గా నిఖత్ జరీన్
  • 52 కిలోల విభాగంలో పసిడి పతకం
  • థాయ్ బాక్సర్ పై సంపూర్ణ ఆధిపత్యం
  • కంగ్రాట్స్ చెప్పిన మహేశ్ బాబు
  • మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్ష

తెలంగాణ బాక్సింగ్ సంచలనం, భారత ఆశాకిరణం నిఖత్ జరీన్ ప్రపంచవేదికపై సాధించిన అద్భుత విజయం పట్ల యావత్ దేశం పొంగిపోతోంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 52 కిలోల కేటగిరీ ఫైనల్ బౌట్ లో 5-0లో థాయ్ బాక్సర్ జిట్ పాంగ్ పై తిరుగులేని విజయం సాధించిన నిఖత్ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. 

కాగా, నిఖత్ విజయం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. భారతదేశం మరోసారి గర్వించదగిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయని పేర్కొన్నారు. 'వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెల్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ నిఖత్ జరీన్' అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

Mahesh Babu
Nikhat Zareen
Gold
Boxing
World Championship
Telangana
India
  • Loading...

More Telugu News