TDP: నారా లోకేశ్‌తో య‌ర‌ప‌తినేని భేటీ

tdp leader yarapatineni meets nara lokesh in hyderabad

  • హైద‌రాబాద్‌లో జ‌రిగిన భేటీ
  • ప‌ల్నాడు జిల్లాలో ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌
  • గుర‌జాల‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌ధాన చ‌ర్చ‌

టీడీపీ సీనియ‌ర్ నేత‌, గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు బుధ‌వారం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి నారా లోకే‌శ్ తో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని లోకేశ్ నివాసంలో జ‌రిగిన ఈ భేటీలో ప‌ల్నాడు జిల్లాలో పార్టీ స్థితిగ‌తుల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌త్యేకించి గుర‌జాల‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల‌పై వీరిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌నంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, దానిని టీడీపీ ఓటుబ్యాంకుగా మార్చునే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యరపతినేని చెప్పారు. ఈ దిశ‌గా పార్టీ అధిష్ఠానం ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న నారా లోకేశ్‌కు సూచించారు.

TDP
Nara Lokesh
Yarapathineni Srinivasa Rao
Palnadu District
Gurajala
Macherla
  • Loading...

More Telugu News