విద్యుత్ వినియోగం తెలుసుకునేందుకే సాగు మోటార్లకు మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి
- ట్రాన్స్‌కో అధికారులతో పెద్దిరెడ్డి సమీక్ష
- మీటర్లపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న పెద్దిరెడ్డి
- విద్యుత్ వినియోగంపై తనీఖీలు చేపట్టాలన్న మంత్రి
విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ట్రాన్స్‌కో అధికారులకు పెద్దిరెడ్డి సూచించారు. అప్రమత్తతలోనే విద్యుత్ చౌర్యం, దుర్వినియోగం, నష్టాలను నియంత్రించగలమని ఆయన పేర్కొన్నారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక విద్యుత్ వినియోగంపైనా తనిఖీలు చేపట్టాలని, తనిఖీల ప్రక్రియ నిరంతరంగా కొనసాగేలా చూడాలంటూ మంత్రి అధికారులను ఆదేశించారు.