Ramdas Athawale: మాతృ దినోత్స‌వం మాదిరే భార్యా దినోత్స‌వం జ‌రుపుకోవాలి: కేంద్ర మంత్రి అథ‌వాలే

union minister Ramdas Athawale demands Wifes Day

  • తల్లి జ‌న్మ‌నిస్తుంది కాబ‌ట్టే మాతృ దినోత్స‌వమన్న అథవాలే 
  • భ‌ర్త మంచి, చెడుల‌లో భార్య పాలుపంచుకుంటుందని వ్యాఖ్య 
  • ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక స్త్రీ ఉంటుంద‌న్న కేంద్రమంత్రి  

మాతృ దినోత్స‌వం జ‌రుపుకుంటున్న మాదిరిగానే భార్యా దినోత్స‌వాన్ని నిర్వ‌హించుకోవాల‌ని రిప‌బ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) అధినేత‌, కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌హారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన సంద‌ర్భంగా భార్యా దినోత్స‌వం గురించి ప్ర‌స్తావించారు. భార్యా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా ఆయ‌న తెలియ‌జేశారు.

త‌ల్లి జ‌న్మ‌నిస్తున్న కార‌ణంగా మాతృ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న మ‌నం... భర్త మంచి, చెడుల‌లో భార్య పాలుపంచుకుంటుంద‌ని, అందుకే మాతృ దినోత్స‌వం త‌ర‌హాలోనే భార్యా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక ఓ స్ట్రీ ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న... ఈ కార‌ణంగానే భార్యా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల‌ని తెలిపారు.

Ramdas Athawale
RPI
Mothers Day
Maharashtra
Wife's Day
  • Loading...

More Telugu News