nagababu: ఈ వార్త‌ల్లో నిజం లేదు: నాగ‌బాబు స్పష్టీకరణ

NagaBabu says There is no Truth in the News
  • ఉత్త‌రాంధ్ర‌లో నాగ‌బాబు ప‌ర్య‌టించనున్న‌ట్లు వార్త‌లు
  • ఈ నెల 17న ఉత్తరాంధ్ర‌లో ప‌ర్య‌టించ‌డం లేద‌ని నాగ‌బాబు ట్వీట్
  • ఇటువంటి వార్త‌లు ఇవ్వ‌డం మానుకోవాలని వ్యాఖ్య‌
ఉత్త‌రాంధ్ర‌లో తాను ప‌ర్య‌టించనున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌ను జ‌న‌సేన నేత నాగ‌బాబు ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ లో దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. ''నేను ఈ నెల 17న ఉత్తరాంధ్ర‌లో ప‌ర్య‌టించ‌నున్నాన‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేదు. నిర్ధార‌ణ చేసుకోకుండా మీడియాలో ఇటువంటి వార్త‌లు ఇవ్వ‌డం మానుకోవాలి. ఏమైనా పర్య‌ట‌న‌లు ఉంటే అందుకు సంబంధించిన షెడ్యూల్ గురించి జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తుంది'' అని నాగ‌బాటు ట్వీట్ చేశారు. 

కాగా, ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న‌ రైతు కూలీల కుటుంబాల‌కు జ‌న‌సేన ఆర్థిక సాయం చేస్తోంది.
nagababu
Janasena
Andhra Pradesh

More Telugu News