Prashant Kishor: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మ‌రోసారి భేటీ కానున్న ప్ర‌శాంత్ కిశోర్

pk to meet kcr
  • ఇప్ప‌టికే ప‌లుసార్లు కేసీఆర్, పీకే భేటీ 
  • ఈ నెల 18న కేసీఆర్‌కు పీకే నివేదిక‌
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో ఇప్ప‌టికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప‌లుసార్లు స‌మావేశ‌మై రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 18న కేసీఆర్, ప్ర‌శాంత్ కిశోర్ మ‌రోసారి భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ వారి భేటీ ఆస‌క్తి రేపుతోంది. 

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న‌ రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు పీకే నివేదిక ఇవ్వనున్నట్లు  తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ కు వివ‌రాలు తెల‌పనున్న‌ట్లు స‌మాచారం. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో వీరు స‌మావేశం నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల‌పై కూడా వారు చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది.
Prashant Kishor
KCR
TRS

More Telugu News