SpaceX: 32 దేశాల్లో స్పేస్ ఎక్స్ ‘స్టార్ లింక్’ సేవలు.. త్వరలో భారత్ లోకి

SpaceXs Starlink now available in 32 countries coming soon to India

  • ప్రకటించిన స్పేస్ ఎక్స్
  • శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ ఇతర సేవలు
  • భారత్ లోకి కమింగ్ సూన్ అంటూ ప్రకటన

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను త్వరలో భారత్ లో ప్రారంభించనుంది. స్టార్ లింక్ పేరుతో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్ సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. 32 దేశాల్లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు ఈ సంస్థ ప్రకటించింది.

యూరోప్, నార్త్ అమెరికాలోని దేశాల్లో, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు ట్విట్టర్ లో స్పేస్ఎక్స్ మ్యాప్ ను కూడా షేర్ చేసింది. ‘కమింగ్ సూన్’ (త్వరలోనే రానున్నాయి) అన్న జాబితాలో భారత్ కూడా ఉంది. అంటే వచ్చే కొన్ని నెలల్లోనే భారత్ లో కూడా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

స్టార్ లింక్ అన్నది శాటిలైట్స్ ఆధారితంగా పనిచేసే నెట్ వర్క్. తక్కువ కక్ష్యలో శాటిలైట్స్ పరిభ్రమిస్తూ, వాటి పరిథిలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటర్నెట్, కాల్స్ సేవలు అందిస్తుంటాయి. 

SpaceX
Starlink
available
India
  • Loading...

More Telugu News