Karate Kalyani: కరాటే కల్యాణి నుంచి నాకు ప్రాణ హాని ఉంది: శ్రీకాంత్ రెడ్డి

I have death threat with Karate Kalyani says Srikanth Reddy

  • కల్యాణి లక్ష రూపాయలు డిమాండ్ చేసిందన్న శ్రీకాంత్ 
  • అమ్మాయిలను పంపించి రేప్ కేసులు పెట్టిస్తానని బెదిరించిందని ఆరోపణ 
  • నా వీడియోలు శ్రుతిమించి ఉండవని వివరణ 

సినీ నటి కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్ స్టర్ శ్రీకాంత్ రెడ్డికి మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పరిధిలో ఉన్న మధురానగర్ లో వీరిద్దరూ గొడవపడ్డారు. ఇద్దరూ కొట్టుకున్నారు. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు, ఏం జరిగిందనే విషయాన్ని శ్రీకాంత్ ఓ వీడియో ద్వారా వివరించాడు.

ఇంట్లో రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మరో మగ్గురు వ్యక్తులతో కలిసి కరాటే కల్యాణి వచ్చిందని.. 'శ్రీకాంత్ బయటకు రా' అని అందరూ గట్టిగా అరిచారని... దీంతో తాను బయటకు వెళ్లానని చెప్పాడు. శ్రీకాంత్ నువ్వు మహిళలను కించపరిచేలా వీడియోలు చేస్తున్నావంటూ కల్యాణి తనను దూషించిందని... నువ్వు సినిమాల్లో చేసే సీన్లు మాత్రం బాగున్నాయా? అని తాను ప్రశ్నించానని తెలిపారు. 

ఆ తర్వాత లక్ష రూపాయల డబ్బు ఇవ్వాలని తనను డిమాండ్ చేసిందని... డబ్బులు ఇవ్వకపోతే హైదరాబాదులో తిరగనివ్వనని, తనకు మహిళా సంఘాలతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించిందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె పక్కనున్న ఒక వ్యక్తి రూ. 70 వేలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమని చెప్పాడని... దీంతో, డబ్బులు ఎందుకివ్వాలని తాను ప్రశ్నించానని అన్నాడు. 

ఆ తర్వాత ఆమె తనను కొట్టిందని, ఆమె పక్కనున్న వాళ్లు కర్రలు తీసుకుని తనను కొట్టేందుకు యత్నించారని శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. బతుకు తెరువు కోసం తాను వీడియోలు చేస్తుంటానని తెలిపాడు. స్క్రిప్ట్ పరంగానే తమ వీడియోలు రూపొందుతాయని చెప్పాడు. వీడియోలు చేయాలని అమ్మాయిలు తమ వద్దకు వస్తుంటారని... డబ్బులు తీసుకుని తాను వీడియోలు తయారు చేస్తుంటానని తెలిపాడు. తన వల్ల వీడియో ఎడిటర్, కెమెరామెన్ కు ఉపాధి లభిస్తోందని చెప్పాడు. 

తన వీడియోలు శ్రుతి మించి ఉండవని, సినిమాల్లో కంటే తక్కువగానే ఉంటుందని అన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టిస్తానని, అమ్మాయిలను తీసుకొచ్చి రేప్ కేసులు పెట్టిస్తానని కల్యాణి బెదిరించిందని చెప్పాడు. చంపేస్తానని బెదిరించిందని... ఆమె నుంచి తనకు ప్రాణ హాణి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఈ వీడియోను విడుదల చేస్తున్నానని చెప్పాడు.

Karate Kalyani
Tollywood
Srikanth Reddy
Youtube
  • Loading...

More Telugu News