Karate Kalyani: యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి

Karate Kalyani Attacked Youtube prankster Srikanth Reddy

  • శ్రీకాంత్‌రెడ్డి ఇంటికెళ్లిన కల్యాణి
  • ప్రాంక్ వీడియోలపై నిలదీత
  • ఆ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణ
  • ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు

ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై ప్రముఖ సినీనటి కరాటే కల్యాణి దాడి చేసింది. నడిరోడ్డుపై అతడిని పట్టుకుని చితకబాదింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్‌లో జరిగిందీ ఘటన.

శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఆయన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలో మధురానగర్ రోడ్డులో శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. అనంతరం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Karate Kalyani
Youtube Prankster
Srikanth Reddy
  • Loading...

More Telugu News