Ravindra Jadeja: ఇన్ స్టాగ్రామ్ లో రవీంద్ర జడేజాను అన్ ఫాలో చేసిన చెన్నై సూపర్ కింగ్స్

  • చెన్నై కెప్టెన్ గా వైదొలిగిన జడేజా
  • సోషల్ మీడియాలో సీఎస్కేని అన్ ఫాలో చేసిన వైనం
  • తాము కూడా అదే పనిచేసిన సీఎస్కే
Chennai Super Kings unfollows Ravindra Jadeja in social media

రవీంద్ర జడేజాకు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్టు అర్థమవుతోంది. కెప్టెన్సీ పెనుభారం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా వైదొలిగిన జడేజా, ఇప్పుడు పక్కటెముకల గాయంతో జట్టుకు కూడా దూరమయ్యాడు. అంతేకాదు, చెన్నై జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్టు తెలిసింది. అయితే, చెన్నై జట్టు కూడా రవీంద్ర జడేజాను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. ఈ చర్య ద్వారా... జడేజా జట్టు నుంచి తప్పుకున్నది గాయంతో కాదన్న విషయం స్పష్టమైంది. 

ఐపీఎల్ తాజా సీజన్ లో జడేజా చెన్నై పగ్గాలు ధోనీ నుంచి స్వీకరించడం తెలిసిందే. కానీ వరుసగా మ్యాచ్ లు ఓడిపోవడంతో జడేజాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాంతో జడేజా కెప్టెన్సీ వదులుకోగా, ధోనీనే మళ్లీ సారథిగా వచ్చాడు. అయితే, జడేజాను చెన్నై యాజమాన్యమే కెప్టెన్సీ నుంచి తప్పించినట్టు ప్రచారంలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఆ ప్రచారం నిజమేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఏదేమైనా జడేజా, చెన్నై జట్ల మధ్య పదేళ్ల అనుబంధం ఈ విధంగా తెగిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

More Telugu News