Ayyanna Patrudu: 'ఇంటర్వ్యూ ఇస్తా.. నాకేం ఇస్తావ్' అంటూ యాంకర్‌కి రిప్లై ఇచ్చాడు: అయ్యన్న పాత్రుడు

ayyanna slams ambati

  • ఇంటర్వ్యూ కావాలంటూ కాంబాబుకి వాట్సప్ లో యాంక‌ర్ మెసేజ్ చేసింద‌న్న అయ్య‌న్న‌
  • త్వ‌రలో ఆయ‌న‌కు సంబంధించిన‌ వివరాలు ప్రపంచానికి తెలుపుతాన‌ని ట్వీట్
  • మహిళా జర్నలిస్ట్ పై బూతు పురాణం అంటూ వ్యాఖ్య‌

ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు పేరును ట్యాగ్ చేస్తూ టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు నిన్న ఓ హెచ్చ‌రిక చేసిన విష‌యం తెలిసిందే. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే అంటూ వార్నింగ్ ఇచ్చిన అయ్య‌న్న పాత్రుడు ఈ రోజు ఇదే విష‌యంపై వివ‌రాలు తెలిపారు.  

''సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్... ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు... త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి. 

మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం'' అని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.

Ayyanna Patrudu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News