North Korea: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్

North Korea Registers First covid Case after Two Years

  • రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కరోనా పరీక్షలు
  • కరోనా వెలుగు చూసిన రెండేళ్లకు మొదటి కేసు
  • వెంటనే సరిహద్దులు మూసేసి లాక్‌డౌన్ ప్రకటించిన కిమ్
  • కిమ్ ఆదేశాలతో కట్టడి చర్యలు ప్రారంభించిన అధికారులు

ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోయినా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటూ ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన ఉత్తర కొరియాలో తాజాగా ఓ కేసు వెలుగుచూసింది. కరోనా వెలుగుచూసిన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం. అయితే, ఒక్క కేసు వెలుగు చూడగానే అప్రమత్తమైన ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లాక్‌డౌన్ విధించారు. దేశాధినేత కిమ్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కరోనా కట్టడి చేసే చర్యలు చేపట్టారు. 

రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న వారికి ఆదివారం కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) నిన్న వెల్లడించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కిమ్ అధికార కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుపై చర్చించారు. వైరస్‌ను అదుపు చేసే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

North Korea
Kim Jong Un
Corona Virus
  • Loading...

More Telugu News