TDP: నాకు ప్రాణ హాని ఉంది... భ‌ద్ర‌త పెంచండి: డీజీపీకి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్న లేఖ‌

  • సంఘ విద్రోహ శ‌క్తులు, న‌క్సలైట్లు, నేర‌స్తుల నుంచి ముప్పు ఉందన్న అచ్చెన్న 
  • టీడీపీ ఏపీ అధ్య‌క్షుడి హోదాలో తాను అడిగిన మేర‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలని వినతి 
  • 1 ప్ల‌స్ 1 గా ఉన్న భ‌ద్ర‌త‌ను 4 ప్ల‌స్ 4కు పెంచాల‌న్న అచ్చెన్న‌
tdp ap chief atchanna writes a letter to dgp to increase security

త‌న‌కు ప‌లు వ‌ర్గాల నుంచి ప్రాణ హాని ఉంద‌ని టీడీపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు, ఏపీ అసెంబ్లీలో టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉపనేత కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆ హాని నుంచి త‌న‌కు ర‌క్ష‌ణ కోసం అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరుతూ ఆయ‌న‌ మంగ‌ళ‌వారం ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డికి లేఖ రాశారు. ప్ర‌స్తుతం అచ్చెన్న‌కు 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త మాత్ర‌మే కొన‌సాగుతోంది. ఈ భ‌ద్ర‌త‌ను 4 ప్ల‌స్ 4కు పెంచాల‌ని కోరుతూ ఆయన ఈ లేఖ రాశారు. 

డీజీపీకి రాసిన లేఖ‌లో అచ్చెన్న ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. సంఘ విద్రోహ శ‌క్తులు, న‌క్స‌లైట్లు, ఇత‌ర నేర‌స్తుల‌తో త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టే క్ర‌మంలో వెళుతున్నామ‌ని పేర్కొన్న అచ్చెన్న‌... త‌న‌కు భ‌ద్ర‌త పెంచాలని కోరారు. టీడీపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడి హోదాతో పాటు టీడీఎల్పీ ఉప నేత హోదాలో తాను కోరిన మేర‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సి ఉంద‌ని కూడా ఆ లేఖ‌లో అచ్చెన్న ప్ర‌స్తావించారు.

More Telugu News