Janasena: 8న శిరివెళ్ల‌కు జ‌న‌సేనాని... 130 మంది కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం

pawan kalyan tour in sirivella on 5th of this month

  • శిరివెళ్ల‌లో ప‌వ‌న్ ర‌చ్చ‌బండ
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం
  • ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన జ‌న‌సేన‌

సాగు క‌లిసి రాక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... 'జనసేన కౌలు రైతు భరోసా యాత్ర'లో భాగంగా ఈ నెల 8న ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని శిరివెళ్ల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శిరివెళ్ల‌లో ఏర్పాటు చేయ‌నున్న ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ పాల్గొంటారు. కార్య‌క్ర‌మంలో భాగంగా శిరివెళ్ల ప‌రిధిలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ 130 మంది కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు. బాధిత కుటుంబాల‌ను ప‌వ‌న్ స్వ‌యంగా ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ మేర‌కు గురువారం జ‌న‌సేన ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

Janasena
Pawan Kalyan
Kurnool District
  • Loading...

More Telugu News