YouTube Premium: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్.. యూజర్లకు లభించే ప్రయోజనాలు ఏమిటి?

YouTube Premium How much it cost benefits and more

  • ప్రకటనలు లేకుండా వీడియోల వీక్షణ
  • ఆఫ్ లైన్ లో డౌన్ లోడ్
  • మంత్లీ ప్యాక్ రూ.129
  • విద్యార్థులు అయితే రూ.79కే ఆఫర్

యూట్యూబ్ చూసే వారికి ‘సబ్ స్క్రయిబ్ టు యూట్యూబ్ ప్రీమియం’ అంటూ ఒక నోటిఫికేషన్ కనిపించడం గుర్తుండే ఉంటుంది. ఉచిత ప్లాన్ తో పోలిస్తే ప్రీమియం ప్లాన్ కింద వీక్షకులకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను యూట్యూబ్ అందిస్తోంది. 

ప్రకటనలు లేకుండా వీడియోలను చూడొచ్చు. ఉచిత ప్యాక్ కింద యూట్యూబ్ ను చూస్తున్న సమయంలో తరచుగా మధ్యలో ప్రకటనలు కనిపిస్తూ అడ్డుపడుతుంటాయి. ఈ ప్రకటనల అసౌకర్యం వద్దని భావించే వారికి ప్రీమియం ప్లాన్ అనుకూలం. అంతేకాదు నచ్చిన వీడియోలను ఆఫ్ లైన్ లో సేవ్ చేసుకోవచ్చు. వాటిని తీరికగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో సేవ్ చేసుకున్న వీడియోలను చూసేందుకు నెట్ అవసరం లేదు. 

రూ.139 నెలవారీ ప్యాక్ ను యూజర్లు ప్రతి నెలా రెన్యువల్ చేసుకోవాలి. అదే ఆటోమేటిగ్గా రెన్యువల్ అయ్యే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే నెలావారీ ప్యాక్ రూ.129కే వస్తుంది. మూడు నెలల ప్లాన్ రూ.399. వార్షిక ప్లాన్ రూ.1,290 అవుతుంది. ఈ రెండు ప్లాన్లు కూడా ఆటో రెన్యువల్ కావు. గడువు తీరిన తర్వాత యూజర్లే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు నెలవారీ ప్లాన్ ను రూ.79కే యూట్యూబ్ ఆఫర్ చేస్తోంది. తాను విద్యార్థిని అంటూ ఆధారం చూపించాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు యూట్యూబ్ మ్యూజిక్ కూడా ఉచితమే.

YouTube Premium
add free
monthly
yearly
  • Loading...

More Telugu News