Dulquer Salmaan: ఆ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదట!

Sitha Ramam Movie Update
షార్ట్స్‌లో చూడండి
హను రాఘవపూడి పేరు వినగానే 'అందాల రాక్షసి' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తరువాత కూడా ఆయన ప్రేమకథలనే విభిన్నమైన కోణాలలో ఆవిష్కరించాడు. ఆయన తాజా చిత్రం కూడా ప్రేమకథా నేపథ్యంలోనే నడుస్తుంది. ఆ ప్రేమకథకి ఆయన ఖరారు చేసిన పేరే 'సీతా రామమ్'.
 
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ .. రష్మిక అలరించనున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి హను రాఘవపూడి మాట్లాడుతూ .. " ఈ సినిమాలో రష్మిక కథానాయిక కాదు .. ఒక కీలకమైన పాత్రలో ఆమె నటించింది. అఫ్రీన్ అనే కశ్మీర్ ముస్లిమ్ అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది. 

ఈ సినిమాలో రష్మిక పాత్రకి డైలాగ్స్ పెద్దగా ఉండవు .. కళ్లతోనే హావభావాలను పలికిస్తుంది. ఎంతోమంది పేర్లను పరిశీలించి ఈ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయడం జరిగింది. 'యుద్ధంతో రాసిన  ప్రేమకథ' అనే క్యాప్షన్ తో రూపొందిన ఈ సినిమాను, తెలుగు .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Dulquer Salmaan
Mrunal
Rashmika Mandanna
Sitha Ramam Movie

More Telugu News