YS Sharmila: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలి: షర్మిల డిమాండ్

YS Sharmila demands TRS Govt to distribute unemployment allowance

  • 25 వారాలుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర
  • ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష
  • నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దీక్ష
  • కొత్త జిల్లాల ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయాలన్న షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అప్పారావుపేటలో దీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు 80 వేలు మాత్రమేనని నిరుద్యోగులను మభ్యపెడుతోందని ఆరోపించారు. పీఆర్సీ కమిటీ వెల్లడించిన 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కొత్త జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

YS Sharmila
Unemployment Allowance
TRS Govt
Praja Prasthanam
YSR Telangana Party
Telangana
  • Loading...

More Telugu News