Vishwak Sen: నా లవ్ బ్రేకప్ సంగతి నెల రోజుల తర్వాత తెలిసింది: విష్యక్సేన్

Hero Vishwaksen about his love break up

  • విష్వక్సేన్ హీరోగా అశోకవనంలో అర్జునకల్యాణం
  • విద్యాసాగర్ చింతా దర్శకత్వం
  • మే 6న రిలీజ్
  • ప్రమోషన్ ఈవెంట్లతో విష్వక్సేన్ బిజీ 

విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు విష్వక్సేన్ తాజాగా అశోకవనంలో అర్జునకల్యాణం చిత్రంలో నటించారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. కాగా, ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో విష్వక్సేన్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలతో చిట్ చాట్ చేశారు. దాంట్లో ఆసక్తికర సంగతులు వెల్లడించారు. 

గతంలో తన లవ్ బ్రేకప్ అయిందని తెలిపారు. తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి తనను వదిలేసిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లవ్ బ్రేకప్ అయిన సంగతి తనకు నెల రోజుల తర్వాతే తెలిసిందని, అది మరింత బాధాకరమని విష్వక్సేన్ పేర్కొన్నారు. మూడేళ్లు ఆ అమ్మాయిని ప్రేమించానని, బ్రేకప్ సంగతి గుర్తుకు వస్తే ఇప్పటికీ ఎంతో వేదన కలుగుతుందని చెప్పాడు. విష్వక్సేన్ ఇన్ స్టా చిట్ చాట్ కు చెందిన వీడియోని అశోకవనంలో అర్జునకల్యాణం టీమ్ నేడు విడుదల చేసింది.

ఈ చిత్రంలో విష్వక్సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించింది. పెళ్లి కోసం పాట్లు పడే 30 ఏళ్ల మధ్య తరగతి వ్యక్తిగా విష్వక్సేన్ ఈ చిత్రంలో అలరించనున్నట్టు తెలుస్తోంది.

Vishwak Sen
Break Up
Love
Asokavanamlo Arjuna Kalyanam
  • Loading...

More Telugu News