Kakani Govardhan Reddy: అనిల్ ఇంటికి కాకాణి... కొత్త మంత్రిని సాద‌రంగా ఆహ్వానించిన మాజీ మంత్రి

minister kakani govardhan reddy gets warm welcome at anilkumar residence
  • నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో అనిల్ నివాసం
  • అనిల్ నివాసానికి వెళ్లిన మంత్రి కాకాణి
  • పార్టీ బ‌లోపేతంపై ఇద్ద‌రు నేత‌ల చ‌ర్చ‌లు
ఏపీలో ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో కొత్త‌గా మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న వారితో తాజా మాజీలకు మ‌ధ్య విభేదాలు పొడ‌చూపిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వివాదాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, కొత్త మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిల మ‌ధ్య క‌నిపించిన విభేదాలు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి,. అయితే ఆ విభేదాలు ఇప్పుడు ప‌టాపంచ‌లైపోయాయి. 

మంగ‌ళ‌వారం నాడు మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి నేరుగా అనిల్ కుమార్ యాద‌వ్ ఇంటికి వెళ్లారు. నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఉన్న త‌న ఇంటికి వ‌చ్చిన కాకాణికి అనిల్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించుకున్న వీరిద్ద‌రూ జిల్లాలో పార్టీ బ‌లోపేతం గురించి అనుస‌రించాల్సిన వ్యూహాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు.
Kakani Govardhan Reddy
Anil Kumar Yadav
Nellore District
YSRCP

More Telugu News