Kane Tanaka: గిన్నిస్ రికార్డుకెక్కిన 119 ఏళ్ల కానే టనాకా కన్నుమూత

Kane Tanaka worlds oldest person dies at 119 years

  • 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా రికార్డు
  • అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న జపాన్ వ్యక్తిగా రికార్డు సొంతం
  • రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన ఏడాదే జననం
  • కానే మరణంతో రికార్డుల్లోకి ఫ్రాన్స్ మహిళ

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన జపాన్‌కు చెందిన కానే టనాకా కన్నుమూశారు. 119 సంవత్సరాల వయసులో ఈ నెల 19న ఆమె తుదిశ్వాస విడిచినట్టు జపాన్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది. నైరుతి జపాన్‌లోని పుకోకా పట్టణానికి చెందిన కానే 116 ఏళ్ల వయసులో మార్చి 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాతి ఏడాది కూడా ఆమె మరోమారు రికార్డులకెక్కారు. 117 సంవత్సరాల 261 రోజుల వయసులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా, ప్రపంచంలోనే సుదీర్ఘకాలం జీవించిన రెండో వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు. 

సోడా, చాక్లెట్‌తోపాటు రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తాను సుదీర్ఘంగా బతకడానికి కారణమని కానే చెప్పేవారు. ఆమె మృతితో ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన లుసిలీ రాండన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా నిలిచారు. ఆమె వయసు ప్రస్తుతం 118 సంవత్సరాల 73 రోజులు. కాగా, 1903వ సంవత్సరం జనవరి రెండో తేదీన కానే జన్మించారు. అదే ఏడాది రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఆమెకు నలుగురు సంతానం కాగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. ఆమె భర్త 1937లో చైనా-జపాన్ యుద్ధంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News