Balasubramaniam: పుట్టినరోజు వేడుక అని చెప్పి ప్రేయసికి నిప్పంటించాడు... ఆపై తానూ నిప్పంటించుకున్న యువకుడు!

Youth set girl friend on fire

  • కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘటన
  • కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలసుబ్రమణియం, బాలిక
  • ప్రేమను నిరాకరించిన ఇరు కుటుంబాలు

కేరళలో విషాద ఘటన జరిగింది. పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం (23), ఓ బాలిక (16) ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అడ్డుచెప్పాయి. దాంతో, చనిపోవాలని నిర్ణయించుకున్న బాలసుబ్రమణియం... తన పుట్టినరోజు వేడుకకు రావాలంటూ ప్రేయసిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ బాలిక రాగానే గదిలోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. ఆపై తాను కూడా అంటించుకున్నాడు. 

మరో గదిలో ఉన్న బాలసుబ్రమణియం తల్లి, సోదరుడు వెంటనే స్పందించి స్థానికుల సాయంతో వారిద్దరినీ త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమికులిద్దరూ కన్నుమూశారు. దాంతో కొల్లెంగోడ్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Balasubramaniam
Girl Friend
Love
Palakkad
Kerala
  • Loading...

More Telugu News