Ambati Rambabu: 'నారా వారి దత్తపుత్రుడు' అనే సినిమా తీయాలనుకుంటున్నాం: పవన్ పై మంత్రి అంబటి విమర్శలు

Ambati Rambabu slams Pawan Kalyan

  • తనను చంద్రబాబు దత్తపుత్రుడు అనొద్దని పవన్ వార్నింగ్
  • లెక్కచేయని ఏపీ మంత్రులు
  • పవన్ మాపై సెటైర్లు వేయవచ్చా? అంటూ అంబటి ఫైర్
  • నన్ను రాంబో రాంబాబు అనలేదా? అంటూ ఆగ్రహం 

తనను ఇంకోసారి చంద్రబాబు దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదని జనసేనాని పవన్ కల్యాణ్ చేస్తున్న హెచ్చరికలను ఏపీ మంత్రులు ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. పైగా, మరింత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ, రైతుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పవన్ కు కనబడడంలేదని అన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

"మాపై వ్యంగ్యంగా మాట్లాడే పవన్ తనపై మాత్రం సెటైర్లు వేయవద్దంటున్నారు. నన్ను రాంబో రాంబాబు అనలేదా?" అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కు స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చని, తమకు సినిమా తీయడం కూడా వచ్చని స్పష్టం చేశారు. 'నారా వారి దత్తపుత్రుడు' అనే సినిమా తీయాలనుకుంటున్నామని వెల్లడించారు. అయినా, పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా? అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

Ambati Rambabu
Pawan Kalyan
YSRCP
Janasena
  • Loading...

More Telugu News