Realme GT 2: రియల్ మీ జీటీ 2 విడుదల.. ధర రూ.34,999

Realme GT 2 with Snapdragon 888 fast charging battery launched in India
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • హెచ్ డీఎఫ్ సీ కార్డుతో కొంటే రూ.5,000 తగ్గింపు
  • స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఏర్పాటు
రియల్ నుంచి ప్రీమియం ఫోన్ జీటీ 2 భారత మార్కెట్లో విడుదలైంది. జీటీ 2 ప్రో కంటే స్పెసిఫికేషన్లు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇది రెండు రకాలుగా విడుదలైంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.34,999. 12 జీబీ, 256 జీబీ స్టోరేజీ రకం ధర రూ.38,999. ఈ నెల 28 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి.

పర్యావరణ అనుకూలమైన బయోపాలిమర్ మెటీరియల్ తో ఫోన్లను తయారు చేస్తున్నట్టు రియల్ మీ తెలిపింది. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో ఇది లభిస్తుంది. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డుపై కొంటే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆరంభ వేరియంట్ ధర తగ్గింపు అనంతరం రూ.29,999కే లభించనుంది. 

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంటుంది.  6.62 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, వైడ్ యాంగిల్, మైక్రోలెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సార్ ను కంపెనీ ఏర్పాటు చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ చార్జర్ తో వస్తుంది.
Realme GT 2
launched
discounts

More Telugu News