TDP: టీడీపీ నేత రాజ‌వ‌ర్ధ‌న్‌రెడ్డి మృతిపై చంద్ర‌బాబు, లోకేశ్ సంతాపం

chandrababu and lokesh condolenses to rajavardhar reddy demise

  • రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి
  • దిగ్భ్రాంతికి గురైన చంద్ర‌బాబు, లోకేశ్
  • సంతాపం ప్ర‌క‌టిస్తూ వేర్వేరుగా ప్ర‌క‌ట‌న‌ల విడుద‌ల‌

తెలంగాణ‌లోని గ‌ద్వాల ప‌రిధిలో ఇటిక్యాల‌పాడు వ‌ద్ద బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో టీడీపీ నేత‌, పార్టీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి దొమ్మన రాజవర్ధన్ రెడ్డి దుర్మ‌ర‌ణం పాలవడం ప‌ట్ల టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌లు సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు వారిద్ద‌రూ ట్విట్ట‌ర్ వేదికగా రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్గి మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. 

రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్న చంద్ర‌బాబు... ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాజవర్ధన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన చంద్ర‌బాబు... ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేశ్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్న రాజ‌వ‌ర్ధ‌న్‌ హఠాన్మరణం బాధాకరమ‌ని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాజ‌వ‌ర్ధ‌న్ కుటుంబ సభ్యులకు లోకేశ్ త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

TDP
Chandrababu
Nara Lokesh
Rajavardhan Reddy
  • Loading...

More Telugu News