Gorantla Butchaiah Chowdary: ఏపీ రాష్ట్ర గవర్నర్ పై బుచ్చయ్య చౌదరి విమర్శలు

Gorantla Butchaiah Chowdary fires on Governor Biswabhusan

  • గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారిపోయారన్న బుచ్చయ్య 
  • ప్రతి ఫైలుపై గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నారని విమర్శ 
  • కాగ్ నివేదికపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని వ్యాఖ్య 

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్సవ విగ్రహంలా మారిపోయారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఫైలుపై గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నారని అన్నారు. ఇలా సంతకాలు పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పారు. కాగ్ నివేదికలు గవర్నర్ వద్దకు వెళ్లాయని... వాటి గురించి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని తెలిపారు. 

ఇప్పటి వరకు రూ. 7.76 లక్షల కోట్లను అప్పు చేసిందని చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక క్రమశిక్షణ లేదని.. జగన్ తప్పుడు నిర్ణయం వల్ల ఏపీ దివాలా తీసిందని మండిపడ్డారు. పతనమవుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలో కూడా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. 

Gorantla Butchaiah Chowdary
Telugudesam
Governor
Biswabhusan Harichandan
  • Loading...

More Telugu News