Jasprit Bumrah: ఇక వన్ వే జర్నీయే.. జస్ప్రీత్ బుమ్రా

Life has not ended Jasprit Bumrah hopes for better show from MI

  • వరుస ఓటములపై స్పందించిన ముంబై బౌలర్
  • ఎవరో ఒకరు గెలవాలి.. ఒకరు ఓడాలి
  • జీవితం ఇంతటితో ముగిసిపోలేదు
  • సూర్యుడు రేపు కూడా ఉదయిస్తాడు
  • ఇకపై మంచి ఫలితాలు సాధిస్తామని ప్రకటన

ముంబైకి మరో ఓటమి తప్పలేదు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోనూ ఆ జట్టు వరుసగా ఆరో ఓటమి ఎదుర్కొన్నది. ఫలితంగా ఈ సీజన్ లో ఇప్పటికి ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ముంబై ఓటమి వైపు నిలిచింది. దీనిపై ఆ జట్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంతో సానుకూలంగా ఉందంటూ.. ఇక ఇక్కడి నుంచి వన్ వేలో దూసుకుపోతామని చెప్పాడు. 

‘‘జీవితం ముగిసిపోలేదు. సూర్యూడు రేపు కూడా ఉదయిస్తాడు. క్రికెట్ ఆట అంటే అదే. ఎవరో ఒకరు గెలవాలి. ఎవరో ఒకరు ఓడాలి. జీవితంలో మేము అన్నీ కోల్పోలేదు ఇంకా. ఒక ఆటలో ఓడిపోయామంతే. మా జట్టులో ఉన్న క్రీడాస్ఫూర్తి ఇది. మా మాదిరిగా ఎవరూ నిరాశ చెందరు. విజయం కోసం పోరాటంలో మేము పెట్టిన కృషిని బయటి వారు ఎవరూ చూడలేరు.

మేం చక్కగా ఆడడం లేదన్నది అంగీకరించేందుకు వెనుకాడడం లేదు. మిగిలిన ఆటల్లో మా వంతు మెరుగైన పనితీరు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. మెరుగైన ఫలితాలు సాధిస్తాం’’అని బుమ్రా పేర్కొన్నాడు. మరోవైపు జట్టు వైఫల్యాలకు పూర్తి బాధ్యత తనదేనని ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ పేర్కొనడం తెలిసిందే. 

Jasprit Bumrah
MI
mumbai indians
IPL
  • Loading...

More Telugu News