Ramoji Rao: రామోజీ ఇంట పెళ్లి వేడుక‌... పంచెక‌ట్టులో క‌నిపించిన‌ ఈనాడు గ్రూప్ అధినేత‌

ramoji rao grand daughter wedding at ramoji film city

  • ఈనాడు ఎండీ కూతురు బృహ‌తి పెళ్లి వేడుక‌
  • రామోజీ ఫిల్మ్ సిటీలో కొన‌సాగుతున్న వివాహం
  • పంచెక‌ట్టులో చ‌లాకీగా కనిపించిన రామోజీ రావు

ఈనాడు గ్రూపు సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు రామోజీ రావు ఇంట శ‌నివారం పెళ్లి వేడుక అట్టహాసంగా జ‌రుగుతోంది. రామోజీ రావు మ‌న‌వ‌రాలు, ఈనాడు ఎండీ కిర‌ణ్‌, శైల‌జ దంప‌తుల కుమార్తె బృహ‌తి వివాహం దండ‌మూడి అమ‌ర్ మోహ‌న్ దాస్‌, అనిత‌ల కుమారుడు అక్ష‌య్‌తో జ‌రుగుతోంది. శనివారం రాత్రి 12.18 గంట‌ల‌కు ఈ పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. 

రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతున్న ఈ వేడుక‌‌కు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. ఈ వేడుక‌లో చ‌లాకీగా క‌నిపించిన రామోజీ రావు కొత్త లుక్‌లో క‌నిపించారు. ఎప్పుడైనా తెలుపు రంగు చొక్కా..అదే రంగు ప్యాంట్‌తో చాలా సాదాసీదాగా క‌నిపించే రామోజీ రావు.. మ‌న‌వ‌రాలి పెళ్లిలో మాత్రం అచ్చ తెలుగు పంచెకట్టులో క‌నిపించారు.

Ramoji Rao
Eenadu
Ramoji Film City
  • Loading...

More Telugu News