Ajith Kumar: అజిత్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన రకుల్!

  • టాలీవుడ్లో చక్రం తిప్పిన రకుల్ 
  • తెలుగులో తగ్గిన అవకాశాలు
  • బాలీవుడ్ పైనే పూర్తి దృష్టి 
  • కోలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ 
Rakul in Ajith Movie

తెలుగులో చాలా ఫాస్టుగా స్టార్ డమ్ తెచ్చుకున్న రకుల్, అంతే ఫాస్టుగా ఆ ప్లేస్ నుంచి జారిపోయింది. అందుకు వరుస ఫ్లాపులు ఒక కారణమైతే, బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టడాన్ని మరొక కారణంగా చెబుతున్నారు. తెలుగులో ఈ మధ్య ఆమె చేసిన 'కొండ పొలం' ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయింది. 

ఈ సినిమాలో ఆమె వైష్ణవ్ తేజ్ తో జోడీ కట్టడం విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ అరడజను హిందీ సినిమాలు ఉన్నాయి. తమిళంలో శివ కార్తికేయన్ తో జతకట్టిన 'అయలాన్' షూటింగును పూర్తిచేసుకుంది. తాజాగా అజిత్ సినిమా కోసం ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ తో ఆమె చేస్తున్న ఫస్టు మూవీ ఇదే.   

 తనతో 'వలిమై' చేసిన దర్శకుడు వినోద్ తోను .. నిర్మాత బోని కపూర్ తోను అజిత్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి రకుల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఇతర ముఖ్యమైన పాత్రల్లో మోహన్ లాల్ .. టబు నటిస్తుండటం విశేషం.

More Telugu News