srithi hsssan: ‘మీ లిప్ సైజ్ ఏంటి?’ అని హీరోయిన్ శ్రుతి హాస‌న్‌ను అడిగిన నెటిజ‌న్!

sriti hsssan insta answer goes viral
  • ఆ ప్ర‌శ్న ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన శ్రుతి
  • లిప్ సైజ్ కూడా ఉంటుందా? అంటూ తిరిగి ప్రశ్న  
  • నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు  
హీరోయిన్ శ్రుతి హాస‌న్ సామాజిక మాధ్య‌మాల్లో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టించింది. ఆ స‌మ‌యంలో శ్రుతి హాస‌న్‌ను ఓ వ్య‌క్తి వింత ప్ర‌శ్న వేశాడు. 

‘మీ లిప్ సైజ్ ఏంటి?’ అని అడిగాడు. దీంతో శ్రుతి హాస‌న్ ఆ ప్ర‌శ్న ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. లిప్ సైజ్ కూడా ఉంటుందా? అని తిరిగి ప్రశ్నించింది. అనంతరం శ్రుతి హాస‌న్ నెటిజ‌న్ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం ఆపేసి వెళ్లిపోయింది. నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న, శ్రుతి హాస‌న్ ఇచ్చిన జ‌వాబుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేశారు.
srithi hsssan
Tollywood
Instagram

More Telugu News