Prakasam District: ప్రకాశం జిల్లాలో దారుణం.. ఇంటర్ విద్యార్థినితో మత్తు పానీయం తాగించి నగ్న చిత్రాలు తీసిన విద్యార్థి

Two Arrested in Prakasam dist for taken naked photos of a inter student

  • స్నేహితురాలి బర్త్ డే కోసం వచ్చిన విద్యార్థిని
  • నగ్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మరో యువకుడు
  • నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

స్నేహితురాలి పుట్టిన రోజుకు వచ్చిన విద్యార్థినితో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి.. ఆపై ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు, వీడియోలు తీశాడో విద్యార్థి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి బర్త్ డే కోసమని మార్కాపురం వచ్చింది. ఆమెతో ఇది వరకే పరిచయం ఉండడంతో మీరావలి ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత కూల్‌డ్రింక్ తాగుదామని తీసుకెళ్లాడు. అందులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. 

అది తాగిన తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ వెంటనే ఆమెను వివస్త్రగా మార్చిన మీరావలి తన మొబైల్ ఫోన్‌లో వీడియో, ఫొటోలు తీసుకున్నాడు. వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్ (22) వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయి బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి చేరాయి. దీంతో వారు పెద్దదోర్నాల చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన మీరావలి, రసూల్‌ను అరెస్ట్ చేశారు.

Prakasam District
Markapur
Inter Student
Naked Photos
  • Loading...

More Telugu News