Khammam: ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు... మాజీ ఎంపీ పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

Ex mp ponguleti srinivasa reddy comments political leaders capabilities

  • అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న పొంగులేటి
  • ప్ర‌జ‌ల్లో తిరిగే వాడే నాయ‌కుండంటూ కామెంట్
  • ప‌ద‌వులు ముఖ్యం కాదంటూ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌
  • అంబేద్క‌ర్ అన్ని వ‌ర్గాల‌కు ఆద‌ర్శమ‌న్న మాజీ ఎంపీ

టీఆర్ఎస్ కీల‌క నేత‌,  ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి నోట నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఖ‌మ్మంలో బుధ‌వారం జ‌రిగిన అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణలో పాలుపంచుకున్న పొంగులేటి, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఉండాల్సిన ల‌క్షణాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌లో ఓ వ‌ర్గం గురించే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.

  "ప‌ద‌వులు ముఖ్యం కాదు. ప్ర‌జ‌ల‌ ప్రేమాభిమానాలు ఉండాలి. అవి లేక‌పోతే రాజ‌కీయ నాయ‌కులు కాల‌గ‌ర్భంలోకి వెళ్లిన‌ట్టే. మ‌నం లేక‌పోయినా ప్ర‌జ‌లు మ‌న‌ల్ని గుర్తు పెట్టుకోవాలి. ప్ర‌జ‌ల్లో తిరిగేవాడే నాయ‌కుడు. నాయ‌కుడు జ‌నంలో ఉండాలి. జ‌నం ఆ నేత‌ను గుర్తు పెట్టుకోవాలి. అంబేద్క‌ర్ అన్ని వ‌ర్గాల‌కు ఆద‌ర్శం" అంటూ పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Khammam
TRS
POnguleti Srinivasa Reddy
Ex MP
  • Loading...

More Telugu News