YouTube: కొన్ని గంటల పాటు నిలిచిపోయిన యూట్యూబ్ సేవలు!

YouTube was down for few hours last night

  • ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి అనుభవం
  • ప్లే కాని వీడియోలు, లాగిన్ లోనూ సమస్యలు
  • ధ్రువీకరించిన యూట్యూబ్
  • పరిష్కరించినట్టు తర్వాత ప్రకటన

యూట్యూబ్ నిత్య జీవితంలో భాగమైపోయింది. రోజులో ఎంతో కొంత సమయాన్ని ఈ ప్లాట్ ఫామ్ కు కేటాయించనిదే నిద్రపోని వారు ఎంతో మంది ఉంటారు. కానీ, మంగళవారం రాత్రి చాలా మందికి నిద్ర లేకుండా చేసింది యూట్యూబ్..!

పాప్యులర్ సామాజిక మాధ్యమం ‘యూట్యూబ్’ మంగళవారం రాత్రి కొన్ని గంటల పాటు పని చేయలేదు. దీంతో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీడియోలు చూసే అవకాశం లేకపోవడంతో వారికి ఏమీ తోచలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఈ అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. యూట్యూబ్ లాగిన్, స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ వీడియోలు ప్లే చేయడం సాధ్యపడలేదు. 

దీన్ని యూట్యూబ్ యాజమాన్యం కూడా అంగీకరించింది. ‘‘యూట్యూబ్ సేవల్లో కొన్ని ఫీచర్లను పొందే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు యూజర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించే పనిలో ఉన్నాం’’ అంటూ యూట్యూబ్ ఓ ట్వీట్ ద్వారా ప్రకటించింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత తిరిగి అదే విషయాన్ని యూజర్లకు తెలియజేసింది. ఇందుకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు.

YouTube
down
not working
technical issues
  • Loading...

More Telugu News