Andhra Pradesh: ఈ నెల 16న సీఎం జగన్ కర్నూలు పర్యటన.. ఇదీ షెడ్యూల్

CM Jagan To Attend Wedding At Kurnool On 16th of this Month

  • ఎమ్మెల్యే శ్రీదేవి బావ కుమారుడి పెళ్లికి హాజరు
  • ఎమ్మెల్యే ఇంట్లో వధూవరులకు ఆశీర్వాదం
  • కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16న జరగనున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. కృష్ణా నగర్ లోని ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పి. కోటేశ్వరరావు తెలిపారు. 

ఇదీ 16న సీఎం పర్యటన షెడ్యూల్..

ఉదయం 10.40: కడప నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు వెళతారు. 
ఉదయం 10.50: అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలియన్ కు చేరుకుంటారు. 
ఉదయం 11.10: ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటికి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. 
ఉదయం 11.20: ఎమ్మెల్యే ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలో పాల్గొంటారు. 11.35 వరకు అక్కడే ఉంటారు. 
ఉదయం 11.45: ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు తిరుగు పయనం. 
మధ్యాహ్నం 12.05: ఓర్వకల్లు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు. 


Andhra Pradesh
Kurnool District
Chief Minister
YSRCP
YS Jagan
Sridevi
  • Loading...

More Telugu News