Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేనికి కీలక పదవిని ఇవ్వనున్న జగన్?

Jagan to give key post to Balineni Srinivasa Reddy
  • కొత్త మంత్రివర్గంలో బాలినేనికి దక్కని స్థానం
  • నిన్న జగన్ ను కలిసిన బాలినేని
  • ఒంగోలు పర్యటనలో బాలినేనికి పదవిని ప్రకటించే అవకాశం

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు బెర్త్ దక్కకపోవడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. నిన్న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇదే సమయంలో బాలినేనిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు సార్లు బాలినేని ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. చివరకు బాలినేని ముఖ్యమంత్రి జగన్ ను కలవడం, తాను జగన్ తోనే ఉంటానని ఆయన ప్రకటించడం జరిగిపోయాయి. 

మరోవైపు, బాలినేనికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. బాలినేనికి జగన్ ఒక కీలక పదవిని కట్టబెట్టనున్నారనేదే ఆ వార్త సారాంశం. ఈ నెల 22న జగన్ ఒంగోలు పర్యటనకు వెళ్తున్నారు. సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలకు ఆయన నగదును విడుదల చేయనున్నారు. మరోవైపు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారైలు ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కంపెనీ బాలినేని చొరవతోనే ఏర్పాటు కాబోతోంది. ఒంగోలు పర్యటన సందర్భంగా బాలినేని పదవికి సంబంధించి జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News