Imran Khan: ఇమ్రాన్ కీలక నిర్ణయం.. జాతీయ అసెంబ్లీకి రాజీనామా
- కొత్త ప్రధాని ఎంపికను బహిష్కరించిన పీటీఐ
- ఆ వెంటనే జాతీయ అసెంబ్లీకి రాజీనామా ప్రకటించిన ఇమ్రాన్
- తనతో పాటు తన పార్టీ సభ్యులూ రాజీనామా చేస్తారని వెల్లడి
పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి తనతో పాటు తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులంతా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ఓ కీలక ప్రకటన చేశారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో త్వరలో జరగనున్న నూతన ప్రధాని ఎన్నికను బహిష్కరించనున్నట్లు పీటీఐ ఎంపీలు కాసేపటి క్రితం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది.