Kurnool District: 3 రోజులుగా క‌న‌ప‌డ‌కుండాపోయిన లాయ‌ర్.. క‌ర్నూలు ప‌ట్ట‌ణ శివారులో మృత‌దేహం ల‌భ్యం

lawyer dead body found in kurnool
  • అనుమానాస్పద స్థితిలో మృతి
  • 3 రోజుల క్రితం త‌న‌ తమ్ముడి వద్దకు వెళ్లిన వెంక‌టేశ్వ‌ర్లు
  • అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో హ‌త్య‌?
ఏపీ హైకోర్టు న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం క‌ల‌క‌లం రేపుతోంది. కర్నూలు పట్టణం శివారులో లాయర్‌ ఆవుల వెంకటేశ్వర్లు మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మూడు రోజుల క్రితం త‌న‌ తమ్ముడి వద్దకు వెళ్లిన వెంక‌టేశ్వ‌ర్లు.. అక్క‌డి నుంచి తిరిగి త‌న ఇంటికి బ‌య‌లుదేరాదు. 

అయితే, అప్ప‌టి నుంచి ఆయ‌న క‌న‌ప‌డ‌లేదు. మూడు రోజులుగా ఆయ‌న‌ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కర్నూలు శివారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అంద‌డంతో దీనిపై విచార‌ణ ప్రారంభ‌మైంది. వెంకటేశ్వర్లును దుండ‌గులు హత్య చేసి రోడ్డు పక్కన పడేసి ఉండొచ్చ‌ని ఆయ‌న కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Kurnool District
lawyer
Crime News

More Telugu News