RRR: ఆర్ఆర్ఆర్ సంచలనం.. రూ.1,000 కోట్లు దాటిన వసూళ్లు

RRR box office collection crosses Rs 1000 crore worldwide
  • 16 రోజుల్లోనే బ్రహ్మాండమైన రికార్డు
  • రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసినవి మూడే సినిమాలు
  • అందులో రెండు రాజమౌళి దర్శకత్వం వహించినవే
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లను వసూలు చేసుకుంది. ఇంతకుముందు రూ.1,000 కోట్లు వసూలు చేసిన చిత్రాలు భారత సినీ చరిత్రలో రెండే ఉన్నాయి. అవి దంగల్, బాహుబలి 2.  ఈ విషయాన్ని సినిమా అనలిస్ట్ మనోబల విజయబాలన్ తన ట్విట్టర్ లో ప్రకటించారు. రూ.1,000 కోట్లు దాటి వసూలు చేసిన మూడు చిత్రాల్లో రెండు రాజమౌళివే ఉండడం.. తన సినిమాకు కమర్షియల్ సక్సెస్ తీసుకురాగల ఆయన నైపుణ్యానికి నిదర్శనమని చెప్పుకోవాలి.  

విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా, ఆయన కుమారుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తెలిసిందే. కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్లను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మార్చి 25న ఈ సినిమా థియోటర్లలోకి రాగా 16 రోజుల్లోనే పెద్ద ఎత్తున కలెక్షన్లు వసూలు చేసుకుందని చెప్పుకోవాలి. 

RRR
collection
Rs 1000 crore
Rajamouli
Junior NTR
Ramcharan

More Telugu News