Sri Rama Navami: ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్, చంద్రబాబు

Leaders wishes people on the eve of Sri Rama Navami

  • రేపు శ్రీరామనవమి
  • రాముల వారి కల్యాణానికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబు
  • సీతారాముల బంధం అజరామరం అన్న కేసీఆర్
  • వైభవంగా జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాంక్ష
  • రాముడే మార్గదర్శి అంటూ చంద్రబాబు ట్వీట్

రేపు (ఆదివారం) శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ, లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని అభివర్ణించారు. 

ఇక, ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ, ఇటు ఒంటిమిట్టలోనూ, అటు భద్రాద్రిలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

ఏపీ విపక్షనేత చంద్రబాబు కూడా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి, ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గదర్శి అని అభివర్ణించారు. కష్టసుఖాలు రెండింటిలోనూ నియమం తప్పని రాముడు ప్రజల మనసెరిగి పాలించాడు కాబట్టే ఈనాటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News