Allu Arjun: పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ స్పెషల్ మెసేజ్ ఇదిగో!

Allu Arjun special message to all on his birthday

  • నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న బన్నీ 
  • ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్
  • సోషల్ మీడియాలో సందేశం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జన్మదిన వేడుకల కోసం యూరప్ వెళ్లిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పెషల్ మెసేజ్ పోస్టు చేశారు. హల్లో ఎవ్రీ వన్ అంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

"మొదట... నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు, దీవెనలే నన్ను ఇంతటివాడ్ని చేశాయి, ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సమయంలో ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే ఎంత అదృష్టవంతుడ్నో అనిపిస్తుంది. ఇప్పటిదాకా మంచి వ్యక్తులు ఎంతోమంది నా జీవితాన్ని స్పృశించారు. 

తల్లిదండ్రుల నుంచి మొదలుపెడితే... కుటుంబం, స్నేహితులు, నా టీచర్లు, శ్రేయోభిలాషులు, నా చిత్ర పరిశ్రమ, నా ప్రేక్షకులతో పాటు నా ప్రియాతిప్రియమైన అభిమానులు ఎంతో మంది నా జీవితంలో ఉన్నారు. జీవితంలో నాకు లభించిన ప్రతి అనుభవం పట్ల ధన్యుడ్ని అయినట్టు భావిస్తాను. నా ఈ అందమైన ప్రస్థానంలో నను వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా మీ స్పందనలకు ముగ్ధుడ్నయ్యాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను" అంటూ బన్నీ తన పోస్టులో వివరించారు.

Allu Arjun
Birthday
Special Message
Tollywood
  • Loading...

More Telugu News