Mancherial District: తనతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిన యువకుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

young girl committed suicide after youg boy refused to delete whatapp status

  • మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఘటన
  • వాట్సాప్ స్టేటస్ నుంచి ఫొటోలు తొలగించమని కోరిన అమ్మాయి కుటుంబ సభ్యులు
  • పట్టించుకోని యువకుడు
  • మనస్తాపంతో పురుగుల మందు తాగి అమ్మాయి మృతి

తనతో కలిసి దిగిన ఫొటోను యువకుడు తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన అమ్మాయి (17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఇటీవల ఉగాది పండుగకు స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అవి చూసిన యువతి తల్లిదండ్రులు ఆ ఫొటోలను స్టేటస్ నుంచి తొలగించాలని యువకుడిని కోరారు. అయినప్పటికీ అతడు వాటిని తొలగించలేదు.

దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Mancherial District
WhatsApp
Young Girl
Crime News
  • Loading...

More Telugu News