AP CM: రేపు కొత్త జిల్లా నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్‌

  • కొత్త జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించిన జ‌గ‌న్‌
  • గురువారం ప‌ల్నాడు జిల్లా కేంద్రంలో ప‌ర్య‌ట‌న‌
  • శుక్ర‌వారం నంద్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌కు ఏపీ సీఎం
ap cm jagan tours nandyal tomorrow

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు ఇటీవ‌లే కొత్త జిల్లాగా ఏర్ప‌డిన నంద్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. నంద్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటారు. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

గురువారం ప‌ల్నాడు జిల్లా కేంద్రం న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌గ‌న్‌.. శుక్ర‌వారం మ‌రో కొత్త జిల్లా అయిన నంద్యాల‌కు వెళుతుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో జ‌గ‌న్ కొత్త జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల ప‌ట్ట‌ణంలోని ఎస్పీజీ మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ వేదిక మీద నుంచి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తారు. ఆ వేదిక మీద నుంచే ఆయన జిల్లా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు.

More Telugu News