Sharad Pawar: సంజయ్ రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు: శరద్ పవార్

Modi not responded when I raised Sanjay Raut issue with him says Sharad Pawar

  • ప్రధాని మోదీతో భేటీ అయిన శరద్ పవార్
  • సుమారు 25 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
  • సంజయ్ రౌత్ పై ఈడీ చర్య అన్యాయమన్న పవార్

ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈరోజు భేటీ అయ్యారు. వీరి సమావేశం సుమారు 25 నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ తీసుకున్న చర్య చాలా అన్యాయమని అన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఒక కేంద్ర సంస్థ ఇలాంటి చర్య తీసుకుంటే... దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సంజయ్ రౌత్ పై ఈడీ చర్య తీసుకుందని చెప్పారు. రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని పవార్ అన్నారు.

Sharad Pawar
NCP
Narendra Modi
BJP
Sanjay Raut
  • Loading...

More Telugu News