Swami Swaroopanandendra: నా శిష్యుడు జగన్ ఇంత గొప్పగా స్పందిస్తారని ఊహించలేదు: స్వామి స్వరూపానందేంద్ర

Swami Swaroopanandendra lauds CM Jagan

  • ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు
  • విశాఖ జిల్లాలోనే పెందుర్తి మండలం
  • తాను గతంలో జగన్ కు చెప్పానన్న స్వరూపానంద
  • తన మాటను జగన్ మన్నించారని ప్రశంసలు  

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. తన మాటను మన్నించి పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, విశాఖ శారదా పీఠాన్ని ఎంతోమంది అభిమానిస్తుంటారని, ఇక్కడి అమ్మవారి శక్తి తెలిసిన వారు అనేకమంది ఆరాధిస్తుంటారని తెలిపారు. 

పెందుర్తి మండలం విశాఖ జిల్లాలో ఉండాలని అనేక మంది తమను కోరారని స్వరూపానందేంద్ర వెల్లడించారు. "ఇదే విషయాన్ని నా శిష్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించాను. నేనంటే ప్రాణం పెట్టే వ్యక్తి జగన్. శారదాపీఠం వార్షికోత్సవానికి వచ్చిన సమయంలో పెందుర్తి మండలం గురించి ఆయనకు చెప్పాను. వారు ఇంత గొప్పగా స్పందిస్తారని నేను కూడా ఊహించలేదు" అని వివరించారు.

Swami Swaroopanandendra
CM Jagan
Pendurthi
Visakhapatnam District
Andhra Pradesh
  • Loading...

More Telugu News